Friday, August 7, 2015

https://www.youtube.com/watch?v=J0W3GQdOg7g

http://www.boredpanda.com/flowers-look-like-animals-people-monkeys-orchids-pareidolia/

Tuesday, August 6, 2013

కబ్జా



(1)ఒద్దు!పెంచొద్దు!నను "పెంపుడు జంతువు" అనొద్దు!
వొదిలేయ్!నన్నొదిలేయ్!నా మానాన్నన్నొదిలేయ్!
------మేం దేనినైనా పెంచామా ?
ఒద్దు!పెంచొద్దు! నను "పెంపుడు జంతువు" అనొద్దు!

నను చూడాలని ఉందా? నాతో ఆడాలని ఉందా?
అయితే నా "చోటు" కి రా! నీ "చోటు" కి తీసుకుపోకు!
నీ "చోటు"లో నను బంధించకు!

(2)ఒద్దు!పెట్టొద్దు!నాకు "తిండి" పెట్టొద్దు!
వొదిలేయ్!నన్నొదిలేయ్!నా పాటుకు/వేటకు నన్నొదిలేయ్!
మేము వేటికైనా పెట్టామా?
వొద్దు!పెట్టొద్దు!మాకు "తిండి" పెట్టొద్దు!

చెట్టును మాత్రం కొట్టెయ్యకు! నరికేయకు! నా పొట్టను మాత్రం కొట్టకు!
మనందరిదైన చెట్టును నువ్వు మాత్రం ఎలా కొట్టేస్తావ్?
నేనెప్పుడూ కొట్టెయ్యనే? 
మేమెప్పుడూ కొట్టెయ్యమే?

(౩)మాతోనె ఉన్నపుడు - మాలాగె ఉన్నావు
మము వీడిపోయాక నువు మారిపోయావు!

నువ్వెళ్ళిపోనాంక బెంగెట్టుకున్నాము
మాకడకు వస్తుంటే తెగ మురిసిపోయాము 
నేస్తమును మరిచావు - బంధించివేశావు - నీ కడకు తెచ్చావు
విషజంతువన్నావు - భయపడుతున్నావు
కౄరమృగమన్నావు - వేటాడుతున్నావు

భాషలను నేర్చేవు - మా భాష మరిచేవు
తీయగా పాడేవు - మా గొంతు నులిమేవు
బాగుగా ఆడేవు - మా కాళ్ళు విరిచేవు
గాలిలో ఎగిరేవు - మా రెక్కలిరిచేవు

మనదైన ఈ పుడమి నీదేను అన్నావు
ప్రహరీలు కట్టేవు - కంచెలూ వేసేవు
మాదార్లు మూసేవు - మమ్మాపు చేసేవు(పెత్తనం చేసేవు)

ఆ చోటు,ఈ చోటు - ప్రతీచోటు నీదంటూ
ఆశలపై ఆశలతో - అత్యాశకు పోతూ
ఏ చోటునైతేను - నీదేను అన్నావో
ఏ చోటుకైతేను - రానీయకున్నావో
ఆ చోటుకై నీవు - బహు పాట్లు పడతావు
నీ తోటి వారితో - అగచాట్లు పడతావు

నీదనన్నది వానిదవుతుందోనని - భయం 
నీదనన్నది మనదనంటే - ఆవేశం 
నీదనన్నది తనదికంటే తక్కువైతే - నిరాశ 
తనదన్నది నీదికంటే ఎక్కువైతే -అసూయ 

ఎలా ఇన్ని బరువులు తగిలించుకునేవు?

నీదనంటే, దాచుకుంటే - అశాంతే
మనదనంటే, పంచుకుంటే - ప్రశాంతే
దాచగలిగేదేది మనకు శాంతినివ్వదని;
పంచుకోడమే తెలిసిన
దాచుకోడం తెలియని మానుంచి
విడువడిన తరువాత
మరచితివా నేస్తమా?


Saturday, August 3, 2013

PREACHING SCENE



                              PREACHING SCENE


 గోదావరి నది మీద ఉన్న బ్రిడ్జి మీదకెళ్ళి, నదిలో దూకి చనిపోదామనుకొని, ఆ నదిని చూచి,భయపడి, ఆ ప్రయత్నాన్ని విరమించుకోబోతోంటే , కాలు జారి , పడిపోబోయి, ఎట్టకేలకు తమాయించుకొని నిలబడ్డాడు వెంకటేష్.
    ఇంతలో తన ఆరోగ్య పరిస్థితి గుర్తుకొచ్చి మరలా వైరాగ్యంతో, ట్రాక్ మీద కొచ్చేటప్పటికి , సరిగ్గా అదే సమయానికి ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ వస్తూండటం చూసి , దాని క్రింద పడదామని ప్రయత్నించబోయి , మరలా భయపడ్డాడు.
    ఇదంతా గమనిస్తూ ఉన్నాడు అప్పటికే అక్కడ కొంచెం దూరం గా ఉన్న నాజర్.
    వెంకటేష్ వెనక్కి తిరిగి చూచాడు నాజర్ ని.
    నాజర్ వెంకటేష్ భయాన్ని చూచి , అర్థం చేసుకొని , " ఇతనేం ఆత్మహత్య చేసుకోడులే" అనుకొని వెనుదిరిగి ఒక అడుగు వేశాడో లేదో వెనకాలే ఇంకొక ట్రైన్ కూత వినపడి - ఈ సారి వెంకటేష్ ఏమి చేస్తాడో చూద్దామని వెనక్కి తిరిగాడు.
    ఈసారి వెంకటేష్ నిజంగా చావడానికి ప్రయత్నించడం గమనించి ఖంగారుగా వెంకటేష్ దగ్గరికి పరిగెత్తాడు.
    సరిగ్గా ఇంకొక్క నిముషంలో వెంకటేష్ మీదనుంచి ట్రైన్ వెళ్ళిపోతుందనగా , ఒక చెయ్యి బలంగా ఇవతలకు లాగేసి రక్షించింది వెంకటేష్ ని.
    ఆ ఊపుకి అదిరిపడ్డ వెంకటేష్ తేరుకొనేసరికి
నాజర్ :     ఐ యామ్ నాజర్. ఆర్మీ లో జనరల్ గా చేసి రిటైర్ అయ్యాను.
        ( అంటూ చెయ్యి కలపబోయాడు .
        తనను చావనివ్వకుండా ఆపి నందుకు చాలా కోపంగా ఉన్న
వెంకటేష్ - చెయ్యి ఇవ్వకుండా కోపంగా చూశాడు నాజర్ కేసి.
        వెంకటేష్ కోపాన్ని చూసి , వెను తిరిగి వెళ్ళిపోతున్న నాజర్ కేసి
కోపంగా చూస్తూ అరిచాడు వెంకటేష్ . )
వెంకటేష్ : ( కోపంగా ) ఇది చెప్పడానికా నన్ను ఆపావు ?
        ( వినిపించుకోకుండా వెళ్ళిపోతున్న నాజర్ కేసి పరుగెత్తి, ఎదురు పడి ,
            ఆపి, కోపంగా ప్రశ్నించాడు వెంకటేష్ . )
        ( కోపంగా ) నిన్నే ?
            నన్నెందుకు ఆపావు ?
నాజర్ : ( కూల్ గా , సూటిగా ) నువ్వెందుకు చావాలనుకొంటున్నావు ?
        ( అంటూ పైనుంచి క్రింద దాకా వెంకటేష్ ని చూస్తూ )
        కళ్ళు, కాళ్ళు, చేతులు - అన్నీ బాగానే ఉన్నాయి కదా ?
        ( వెంకటేష్ " ఛ ! నన్నాపడమే కాకుండా డిస్కషన్ ఒకటా ? "
అన్నట్లు నాజర్ కేసి ఒక చూపు చికాకుగా చూచి , వెను తిరిగాడు .)

        ( నాజర్ వెనక నుంచి ఇంకా అడుగుతున్నాడు . )
        లవ్ ఫెయిల్యూరా ?
        (    వెంకటేష్ కి ఉక్రోషం పెరుగుతూండటంతో కళ్ళు
            ఎర్రపడుతున్నాయి , ముఖం ముడుచుకుంటోంది.)
        (    నాజర్ ఇంకా చెపుతున్నాడు.)
        అలాంటి పిరికి సాకులు చెప్పకు!
        ప్రతీ చిన్న సమస్యకీ ఆత్మహత్యేనా ?
        (    వెంకటేష్ కి చిర్రెత్తుకొచ్చింది. చాలా కోపంగా, అసహనంగా -
            వెనక్కి తిరిగి , ఒక్క ఉదుటున నాజర్ దగ్గరకొచ్చి)
వెంకటేష్ : ( లో వోయిస్ లో ) నాకు బ్రెయిన్ ట్యూమర్ !
        ( నువ్వు నన్ను చూచి జాలి పడాలి ! తెలుసా ? అన్నట్లు చెప్పాడు
        వెంకటేష్.)
        (అంతే ! ఒక్కసారి వెంకటేష్ కళ్ళలోకి " ఇది నిజమా ?"
            అన్నట్లు ఆశ్చర్యంగా చూచాడు నాజర్.)

నాజర్ : ( ఆర్ద్రతతో , లో వోయిస్ లో ) ఐ యామ్ సారీ !
        (అంటూ వెంకటేష్ కళ్ళలోకి చూచాడు.
        తనపై జాలి చూపమన్నట్లు "సెల్ఫ్ పిటీ" తో ఉన్న వెంకటేష్
        చూపులను చూస్తూనే తల తిప్పేసుకొని, ఒక క్షణమాగి, వెంకటేష్ ని
        దాటి కెమేరా వైపు ముందుకు నాలుగడుగులు వేసి )
        (ధృడంగా)అయితే ?
        (అని కొంచెం ఆగి)
        ఈ రోగం నీ ఒక్కడికే వచ్చిందా ?
        ప్రపంచంలో ఎంతమంది ఈ రోగం బారిన పడుతున్నారు ?
        వాళ్ళందరూ నీలాగే చనిపోతున్నారా ?
        ఇలా చనిపోవడం పిరికితనం!
        పదిమందికీ పనికొచ్చే పనులేమైనా చెయ్యి.
        నువ్వు చచ్చిపోయాక కూడా వాళ్ళ గుండెల్లో ఎప్పటికీ బ్రతికుంటావు!
        ఆదర్శవంతుడివవుతావు!
         
        అందరిలో ఒకడిగా కంటే - అందరికోసం ఒకడిగా ఉండు!
         
        ఊరికే ఇలా చనిపోయే బదులు - నీకు చేతనయినందమందికి హెల్ప్
        చేసి,చావు వచ్చినప్పుడే పోతే - ఆఖరి క్షణం వరకూ ఇంకొకళ్ళకు
        పనికొచ్చామన్న తృప్తితో ఎంత గర్వంగా ఉంటుందో ఆలోచించు!
        (ఈ లెక్చర్స్ వింటున్న కొద్దీ వెంకటేష్ లో చికాకు, అసహనం
        పెరుగుతున్నాయి.
        ఇంకా ఏదో చెప్పబోతున్న నాజర్ లెక్చర్ ని మధ్యలో కట్ చేస్తూ )
వెంకటేష్ : (చికాకుగా,అసహనంగా )ఇంక పదిహేను రోజులే నేను బ్రతికేది!
        ( నాజర్ ఒక్క క్షణం " అలాగా ?" అన్నట్లు చూచి)
నాజర్ : ఉన్నవి పదిహేను రోజులే కదా అనుకొంటే ఏమీ చేయలేమనిపిస్తుంది.
        ఉన్నవి "పదిహేను రోజులు" అనుకొంటే ఇంకా ఎన్ని చెయ్యొచ్చో
        తెలుస్తుంది!
        అప్పుడిలా అర్ధాంతరంగా చనిపోవడానికి ప్రయత్నించవు!
        (వెంకటేష్ అసహనం తారాస్థాయికి చేరడంతో ఆవేశంగా నాజర్
        దగ్గరకు పరుగుపరుగున వచ్చి)
వెంకటేష్ : (అసహనంగా) నీతి సూక్తులు బాగానే చెప్తున్నావే ?
        ( అని ఒక్క క్షణం ఆగి)
        అవునూ , నువ్వేమిటీ , ఈ టైమ్ లో ఇక్కడేమి చేస్తున్నావు ?
        (అంటూ ఎగాదిగా చూస్తూ)
        రేపో మాపో చనిపోయే నాలాంటి వాళ్ళకి క్లాసులు పీకుతూ టైమ్
        వేస్ట్ చేసుకొనే బదులు - నువ్వు కూడా నలుగురికీ పనికొచ్చే మంచి
        పనులు చెయ్యొచ్చుగా ?
        Actions speak louder than words !
        మాష్టారూ! లెక్చర్లు ఎవడైనా పీకుతాడు.
        చేసి చూపించు -    follow అవుతాము!
        (అంటూ ఎగాదిగా చూస్తూ)
        చూస్తూంటే దిట్టంగా బాగానే ఉన్నావే ?
        (అంటూంటే నాజర్ చేతులు వెనక్కి పెట్టుకొని ఏదో దాస్తూ ఉండడం వెంకటేష్ అంతగా పట్టించుకోలేదు.)
        (అని, వెను తిరిగి, కెమేరా కేసి ఒక్క అడుగు వేసి, మరల నాజర్ వైపుకు తిరిగి చూచాడు వెంకటేష్ - నాజర్ చేతులు వెనక్కి పెట్టుకొని ఏదో దాస్తున్నట్లు లీలగా చూచినది గుర్తొచ్చి, అనుమానంగా.)
        (ఆతృతగా) ఏంటది ? ఎందుకు దాస్తున్నావు ?
        (అంటూ ఆ చేతుల్లోని వస్తువుని చూడడానికి నాజర్ మీద కెళ్ళాడు వెంకటేష్,
        నాజర్ ప్రతిఘటించబోయి, క్రింద పడ్డాడు.
        అప్పుడు కనబడింది వెంకటేష్ కి నాజర్ చేతిలోని ఆ వస్తువు - టైమ్ బాంబ్ !
        - dismantle చేయబడింది.
        వెంకటేష్ షాకింగ్ గా చూస్తున్నాడు!
        నాజర్ ఎలాంటివాడా అని అనుమానంగా)
        టైమ్ బాంబ్ ?
నాజర్ : ఇక్కడుందని information వస్తే, దాన్ని
        dismantle చేసేసరికి , నువ్వు వచ్చి .....
        (అంటూ పెద్దగా దగ్గాడు.
        నాజర్ నోట్లోంచి చాలా రక్తం పడింది!
        పైకి లేస్తూ, క్రింద పడిపోయిన తన పర్స్ తీసుకుంటున్నప్పుడు
        అందులోంచి ఒక ఫోటో క్రింద పడిపోవడం నాజర్ గమనించలేదు -
        కానీ వెంకటేష్ గమనించాడు.
        పైకి లేస్తున్న నాజర్ ని చూచి ఆశ్చర్యపోయాడు వెంకటేష్.
        నాజర్ కి ఒక చెయ్యి చెక్క చెయ్యి!
        వెంకటేష్ కి చాలా ఆశ్చర్యంగా ఉంది!
        నెమ్మదిగా నాజర్ మీద గౌరవం పెరగడం ప్రారంభించింది!)
వెంకటేష్ :(ఆతృతగా) ఏమయ్యింది ? రక్తం కక్కుతున్నారు ?
నాజర్ : (అప్పటికి పైకి లేచి) Blood Cancer - Final Stage
        (చాలా మామూలు విషయం చెప్పినంత తేలికగా చెప్పాడు నాజర్.)
        (వెంకటేష్ కి కాళ్ళక్రింద భూమి బ్రద్దలైనంత ఆశ్చర్యంగా ఉంది!)
        (అంటూ తన పర్స్ ని వెతుక్కుంటున్నాడు - మిస్ అయిన ఫోటో
        గురించి - చుట్టూ , క్రింద ఎక్కడ పడిందా అని చూస్తున్నాడు.
        వెంకటేష్ కి విషయం అర్థమై, ఆ ఫోటోని తీసి , ఒకసారి చూచి,
        నాజర్ కి అందిస్తూ)
వెంకటేష్ : ఫోటో ఎవరిదీ ?
నాజర్ : నా తమ్ముడిది!
        (కొంచెం ఆగి)
        బ్రతికుంటే నీ వయస్సుండేది!
        (వెంకటేష్ షాకింగ్ గా చూచాడు!
        ఇప్పుడు అర్థం అయ్యింది తనని ఎందుకు చావనివ్వలేదో - తన
        తమ్ముడు గుర్తుకొచ్చి ?)
        (నాజర్ ఇంకా చెపుతున్నాడు.)
        ఇరవై యేళ్ళ క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు!
        (sympathetic గా చూస్తూన్న వెంకటేష్ కేసి ఒక్కసారి చూచి,ఇంకా
        చెపుతున్నాడు నాజర్.)
        Army లో పని చేసిన నాకు మనిషి ప్రాణాలు వృధాగా పోతూంటే
        బాధనిపిస్తూ ఉంటుంది!
        (అంటూ వెను తిరిగి వెళ్తున్న నాజర్ తో పదం కలిపాడు వెంకటేష్.)

Thursday, July 25, 2013

Mother Nature Belongs To All The Living Beings - NOT Just A Privileged Few !!!





*********************************************************************************

The Text Version :

Don't "Pet" me - Just Leave me to "Live" my Life ;
Do We "Pet" Others ?
Don't Restrict me - putting Chains,Fences and Compound Walls - I Move wherever I want to; 
Don't Catch Me ;
Don't "Feed" me - Just Leave me to "Get" my Food ;
Do we Feed other species?
Don't get me starved - cutting trees;
How Can "You" cut the trees - when they belong to "All of US" ?
Did we ever cut a tree?
Do You Enjoy Seeing My Beauty ?Do You Enjoy Watching My Deeds ?
Then, Come to "Where I belong" ;
Don't take me to "Where You belong";
And, Don't keep me "Where You belong;"
How can you "Enjoy", keeping my "Life" and "Freedom" at stake ?
Did we ever bother other species, if NOT for food?
Mother Nature belongs to all of us;
I have "the same rights" on this Nature as You have;
We hope You would "realize" it oneday;
"Live and Let Live;;;"
Occupying The Land that belongs to "All of US" and "Claiming" it as "Yours",
Not letting us Enter - Keeping Fences and Compound Walls;
All this - Transforms You "Greedy";
And, your "Greed" will NOT let you - live Happy and Peaceful;
Makes You Fight among yourselves -
for what you have "shielded" us from -
the same Food and Land;
"Petting" us - keeping us where you belong
Letting us "Starve" , -cutting trees ;
And , "Feeding" us, with some of the same Food
that we could have "Got More of which",
from Our Mother Nature;
All these Deeds of You 
- Make you Mistakenly think "High" about Yourself 
- Mislead you - try to "Dominate Others";
And this Attitude of Yours 
is the Very Reason For Fights and Wars ,
"Draining Away" your Peace;
"Leaving" You Unhappy;
You "Starve" us like this;
"Shield" us from entering OUR Land - that you OCCUPIED
Yet We don't keep in mind and Grow Wild;
We "Forget and Forgive" You 
- We Follow Our Father's Words;
Mistakenly Thinking that it is your own - when it belongs to all of us ;
You try to Save it - And don't try to Share it;
When others come to take Their Share - You become Tensed and Grow Anger;
We know - "the Nature" belongs to all of US - We Share ; but don't have to Save;
So - We don't Grow Anger; No Unhappiness;
Since We Share - but NOT Save ; No Comparisons of Who has More - No Question of Jealousy;
You Make us Unhappy - You become Unhappy - acquiring "Greed","Angry","Jealousy"
You were like us - So, You Can Be - Pure and Happy
As you sow, so shall you reap;;;


Sunday, March 24, 2013

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం


సర్వేంద్రియాణాం నయనం ప్రధానం

    "అన్ని అంగాలలోకీ కళ్ళు అత్యంత ప్రధానమైనవి.
        కరెక్టే! కానీ,అలాగని - వాటిని మాత్రమే ఉపయోగిస్తూ,మిగిలిన అంగాలన్నింటినీ అతి జాగ్రత్తగా,పొదుపుగా,ఏదో పసిపిల్లాడు ఉపయోగించినంతవరకు మాత్రమే,పశుపక్ష్యాదులు ఉపయోగించినంత వరకు మాత్రమే ఉపయోగిస్తే ఎలా?
    కళ్ళముందే ఇంత అన్యాయం ఇలా జరిగిపోతూ ఉంటే,చూస్తూ ఊరుకుంటే ఎలా?
    నోటిని తినడానికి మాత్రమే వాడితే ఎలా? - అన్యాయాన్ని ఎదిరించి, అడగడానికి కూడా వాడాలి!
    చేతుల్ని నోట్లకట్టలు పట్టుకోడానికే కాకుండా - నోట్లకట్టలు పంచడానికి,అన్యాయాన్ని ఎదిరించడానికి కూడా వాడాలి!
    కాళ్ళని అన్యాయానికి భయపడి పారిపోవడానికి కాకుండా అన్యాయాన్ని ఎదిరించి త్రొక్కిపడేయడానికి వాడాలి!"
    అంటూ అప్పటిదాకా దెబ్బలుతిని అక్కడ పడి ఉన్న పనిపిల్లాణ్ణి తనతో తీసుకెళ్తోంటే,మేమంతా ఆయనను ఫాలో అవడానికి మొట్టమొదటిసారి మా కాళ్ళను సరియైన పద్ధతిలో ఉపయోగిస్తూ,ఆ అన్యాయం చేసిన వాడివైపు నోటినీ,చేతుల్నీ,కాళ్ళనీ - అన్నిటినీ ఉపయోగిస్తూ ఉంటే - ఆయన కళ్ళు చెమ్మగిల్లడం - చెమ్మగిల్లిన మా మనస్సులకు కనపడి, ఎప్పట్నించో పనిచెయ్యకుండా మొరాయించిన మా గుండెలు ’ఆర్ద్రతతో స్పందించడం’లో ఉన్న ఆనందాన్ని మరలా చవిచూచాయి.
౦-------------౦----------౦
(సరదాగా "సర్వేంద్రియాణాం నయనం ప్రధానం" కు వేరే అర్థం చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇది.)